ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా మంది ఉసిరి జ్యూస్ తాగుతుంటారు. ఉసిరితో రకరకాల రోగాలు దూరమవుతాయని సాధారణంగా ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
కానీ మీకు తెలుసా, ఉసిరి తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఉసిరి అస్సలు తినకూడదు. ఇలాంటి వారికి ఉసిరి విషంతో సమానం.
ఉసిరి అధికంగా తినడం వల్ల రక్తపోటు సాధారణం కంటే భారీగా తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉండాలి.
అలాగే కడుపు సమస్యలు, గుండెల్లో మంట సమస్యలు ఉన్నవారు కూడా ఉసిరి జ్యూస్ తీసుకోకూడదు. ఉసిరికాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలం గట్టిపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉసిరికి దూరంగా ఉండాలి.
ఉసిరికి మూత్రవిసర్జన లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువ మూత్రాన్ని విడుదల చేస్తుంది. కాబట్టి ఉసిరికాయను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఈ సమస్యలు లేనివారు చలికాలంలో ఉసిరి పరిమిత మోతాదులో తినవచ్చు. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.