శబరిమల వద్ద నిన్న ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి ఓ భక్తుడు మృతి చెందాడు. మృతి చెందిని కర్ణాటక రాష్టానికి చెందిన కుమారస్వామి(40)గా గుర్తించారు. ఫ్లైఓవర్‌పై నుంచి ఆ భక్తుడు కిందకు దూకాడు. గాయపడిన అతన్ని ప్రత్యేక చికిత్స కోసం కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. సన్నిధానం నుంచి మళికప్పురం వెళ్లే ఫ్లైఓవర్ పై నుంచి భక్తుడు కిందకు దూకాడు. అతడికి మానసిక సమస్యలున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శబరిమల ఆదాయం గతేడాది కంటే భారీగా పెరిగింది. ఈ సీజన్‌లో 29 రోజుల్లో 163.89 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది. క్రితంసారి ఇదే సమయంలో రూ.141.13 కోట్లుగా ఉంది. ఈ ఏడాది 22 కోట్లకు పైగా ఆదాయం పెరిగింది. అరవణ(ప్రసాదం) విక్రయం ద్వారా కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది. 80 కోట్ల రూపాయలకు పైగా అరవణ అమ్ముడుపోయింది. గతేడాదితో పోలిస్తే కూడా రూ.8 కోట్లకు పైగానే వచ్చాయి. ఈ సీజన్‌లో 29 రోజుల్లో 22 లక్షల మందికి పైగా భక్తులు రాగా, గతేడాది ఇది దాదాపు 18 లక్షలు మంది భక్తులు వచ్చారు.
ఈసారి నాలుగు లక్షల మందికి పైగా భక్తులు ఎక్కువ వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ తెలిపారు. భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ప్రతి ఒక్కరికీ దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్ల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా అరవణను సరఫరా చేసినట్లు, ఫలితంగా ఆదాయం పెరిగిందని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విజయవంతంగా పనిచేస్తున్నారని ప్రశాంత్ ప్రశంసించారు.
శబరిమలకు ప్రస్తుతం ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ కాలేదు. సన్నిధానం, పంపా, నిలక్కల్‌లో ఈరోజు రేపు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబరు 22న ఉదయం 6 గంటలకు తంగయాంగి ఊరేగింపు అరన్ముల నుండి బయలుదేరుతుంది. 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు సన్నిధానం చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు తంగయంగి చార్తితో దీపారాధన నిర్వహిస్తారు. 23, 24 తేదీల్లో పోలీసులు, దేవస్వం బోర్డు ఉద్యోగులచే కర్పూరాళి నిర్వహిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి