కోవిడ్ తర్వాత ఆరోగ్యం విషయంలో అందరూ కేర్ తీసుకుంటున్నారు. చాలామంది మంది బయట ఫుడ్ తినడం మానేశారు. డైలీ వ్యాయామం చేస్తున్నారు. లైఫ్ స్టైల్‌లో ఇంకా ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. ఇక అనారోగ్య సమస్యలు దరి చేరుకుండా ఉండేందుకు పాతకాలం నాటి వంటింటి చిట్కాలు పాటిస్తున్నారు. ఆరోగ్య రుగ్మత ఏదైనా.. అల్లం చేసే మేలు చెప్పలేనిది అని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. ఇది సైంటిఫిక్‌గా సైతం ప్రూవ్ అయింది. ఉదయం ఖాళీ కడుపుతో చిన్న అల్లం ముక్క తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం…
- అల్లంలో ఉండే కొన్ని రసాయన సమ్మేళనాలు శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా, ఇనెఫెక్షన్స్ నుంచి రక్షణ ఇస్తాయి
- మార్నింగ్ సిక్‌నెస్ ఉన్నవారు ఉదయాన్నే అల్లం ముక్క తింటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి
- కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో హెల్ఫ్ చేస్తోంది
- అల్లం రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుతుంది. దీనివల్ల డయాబెటీస్ వచ్చే చాన్సులు తక్కువగా ఉంటాయి.
- అల్లంలో వికారాన్ని తగ్గించే శక్తి.. వాపు, మంట సింటమ్స్ తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి
- ఇక మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పెయిన్స్ నుంచి రిలీఫ్ ఉంటుంది
- దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. అల్లంలో జింజెరోల్స్, షోగోల్స్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి గొంతు ఉపశమనానికి సహాయపడతాయి
- పచ్చి అల్లం లాలాజలం, శ్లేష్మం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది గొంతును పూత, చికాకును తగ్గిస్తుంది. అదనంగా, అల్లంలొరి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు, వాయుమార్గాలలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి, శ్వాస తీసుకోవడం ఈజీగా ఉంటుంది.
- వికారం తగ్గడానికి మీరు పొద్దున్నే పచ్చి అల్లం ముక్కను నమలవచ్చు
పచ్చి అల్లంను ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపడుతుంది. కడుపు మంట తగ్గుతుంది. జీవక్రియ సాఫీగా సాగుతుంది. అల్లంను మీ దినచర్యలో చేర్చడం ద్వారా, శక్తివంతమైన ప్రయోజనాలు పొందవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.