బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగిసింది. 106 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ రియాలిటీ షోలో చివరకు సీరియల్ నటుడు నిఖిల్ విజేతగా నిలిచాడు. తెలుగబ్బాయి గౌతమ్ కృష్ణ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అంతకు ముందు టాప్ -5 లో నిలిచిన అవినాశ్, ప్రేరణ, నబీల్ ఎలిమినేట్ అయ్యారు. చివరకు గౌతమ్, నిఖిల్ టాప్ -2 లో నిలిచారు. ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు నాగార్జున ఇచ్చిన ఆఫర్ ను ఇద్దరూ తిరస్కరించారు. దీంతో చివరకు నిఖిల్ ను విజేతగా ప్రకటించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విజేతకు బిగ్ బాస్ ట్రోఫీ బహూకరించారు. అలాగే రూ.55 లక్షల చెక్కును తీసుకున్నాడు. వీటితో పాటు మారుతి డిజైర్ కారు అదనపు బహుమతిగా లభించనుంది. కాగా ఈ విజయాన్ని తన తల్లికి అంకితం ఇచ్చాడు నిఖిల్. తెలుగు ఆడియన్స్ మరోసారి తనని తమ ఇంటి బిడ్డగా ప్రూవ్ చేశారని ఎమోషనల్ అయ్యాడు.
నిఖిల్ సొంతూరు కర్ణాటకలోని మైసూర్. అతని తండ్రి ఓ జర్నలిస్ట్ కావడం విశేషం. ఇక గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు నిఖిల్. ఆ తర్వాత ‘కలిసివుంటే కలదు సుఖం’ సీరియల్‌లో కూడా ఓ మంచి పాత్ర చేశాడు. ‘స్రవంతి’, ‘ఊర్వశివో రాక్షసివో’ సీరియల్స్ కూడా నిఖిల్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. సీరియల్స్‌తో పలు టీవీ షోలు, గేమ్ షోలు, ఫెస్టివల్ ఈవెంట్స్‌లో నిఖిల్ సందడి చేశాడు. బిగ్‌బాస్ సీజన్-8కి వచ్చే ముందు ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్’ షోలో కూడా నిఖిల్ పాల్గొన్నాడు. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు నిఖిల్ వారానికి రూ.2.25 లక్షల పారితోషికం తీసుకున్నాడట! ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.33,75,000 సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే ప్రైజ్ మనీతో కలిపి మొత్తంగా రూ. 88 లక్షలు నిఖిల్ సంపాదించాడని సమాచారం.
ఇవి కూడా చదవండి
నాగార్జున, రామ్ చరణ్ ల తో బిగ్ బాస్ విజేత నిఖిల్..
A huge congratulations to Nikhil for clinching the Bigg Boss Telugu 8 title! 🏆✨
Your hard work and dedication have paid off. #BiggBossTelugu8 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/GjeiUaTZqU— Starmaa (@StarMaa) December 15, 2024
రన్నరప్ గా డాక్టరబ్బాయి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.