ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తబలా విద్యాంసుడు జాకీర్ హుస్సేన్ (73) హఠాన్మరణం చెందారు. అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన మృతితో భారతీయ చలన చిత్ర రంగం, సంగీత అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ముంబైలో పుట్టిన జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, పద్మవిభూషన్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు.