Prabhas: స్పిరిట్ మూవీకి హీరోయిన్ దొరికేసింది.. ప్రభాస్ సరసన మరాఠి ముద్దుగుమ్మ.. ఎవరంటే.

Prabhas: స్పిరిట్ మూవీకి హీరోయిన్ దొరికేసింది.. ప్రభాస్ సరసన మరాఠి ముద్దుగుమ్మ.. ఎవరంటే.


అర్జున్ రెడ్డి, యామిమల్ వంటి హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ రెండు సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో రూపొందించనున్న ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇదివరకు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటివరకు సందీప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రాలకు ఈ సినిమా విభిన్నంగా ఉంటుందని ముందు నుంచి టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే స్పిరిట్ మూవీ గురించి నిత్యం ఏదోక న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

స్పిరిట్ చిత్రంలో మరాఠి, బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్న ఓ హీరోయిన్ నటించనుందట. ఈ అమ్మడుకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. 2025లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు నటీనటుస ఎంపిక జరుగుతుంది. నివేదికల ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలలో కనిపించనున్నారట. వీరిద్దరిది నెగిటివ్ రోల్స్ ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు హీరోయిన్ గా మృణాల్ ను ఎంపిక చేశారనే టాక్ నడుస్తుంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రానికి సందీప్ మునుపటి బ్లాక్ బస్టర్ యానిమల్ సంగీతాన్ని అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈమూవీకి మ్యూజిక్ అందించనున్నారు. భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ సంయుక్తంగా ‘స్పిరిట్’ని నిర్మిస్తున్నాయి. ‘స్పిరిట్’ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ షూటింగ్ ప్రారంభించనున్నారు.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *