సులభంగా డబ్బు సంపాదన కోసం ఇంటి వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే తరహాలో ఒక వ్యక్తి తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాయంపేట ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. వెంకట నర్సయ్య (72) అనే వ్యక్తి వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. మరింత సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా.. తన ఇంటి పెరట్లో ఐదు అడుగుల గంజాయి మొక్కలు పెంపకం చేపట్టి.. వాటిలో కొన్ని మొక్కలను ఎండబెట్టి విక్రయించేందుకు సిద్దమయ్యాడు. నిందితుడు గంజాయి మొక్కలను పెంపకం చేపట్టినట్లుగా యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంకు సమాచారం రావడంతో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ బృందం జాగిలాలతో తనిఖీ చేశారు. ఇంటి పెరట్లో గంజాయి మొక్కను గుర్తించారు. ఆ మొక్కలను పీకేసి, పెంపకం చేపట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చాకచక్యంగా గంజాయి సాగును పసిగట్టిన సిబ్బందిని సీపీ అభినందించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి