6,6,4,6,4.4.. ఓర్నీ.! శివాలెత్తిన కోహ్లీ టీమ్‌మేట్.. పిచ్చకొట్టుడికి దండేసి దండం పెట్టాల్సిందే

6,6,4,6,4.4.. ఓర్నీ.! శివాలెత్తిన కోహ్లీ టీమ్‌మేట్.. పిచ్చకొట్టుడికి దండేసి దండం పెట్టాల్సిందే


బిగ్ బాష్ లీగ్ 2024-25లో ఇటీవల ఓ అద్భుతమైన మ్యాచ్ జరిగింది. ఈ సీజన్‌ మూడో మ్యాచ్‌లో కాన్‌బెర్రా వేదికగా సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే ఈ విజయంలో సిడ్నీ థండర్స్ ఆటగాడు డేనియల్ సామ్స్ హీరోగా నిలిచాడు. అతడి పేలుడు ఇన్నింగ్స్ మొత్తం మ్యాచ్‌ను మార్చేసింది. 233 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టి తన జట్టును విజయపథంలో నడిపించాడు.

ఓడిపోయే మ్యాచ్‌లో డేనియల్ సామ్స్ దూకుడు..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిడ్నీ థండర్స్ 149 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అప్పుడు జట్టుకు 12 బంతుల్లో 34 పరుగులు కావాల్సి ఉండగా.. డేనియల్ సామ్స్ బరిలోకి దిగాడు. కేవలం 6 బంతుల్లోనే మ్యాచ్‌ను తన జట్టువైపునకు మార్చేశాడు. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌ని లాయిడ్ పోప్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ వరకు అతడు మ్యాచ్‌లో చాలా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాదు.. ఒక వికెట్ కూడా పడగొట్టాడు.

కానీ 19వ ఓవర్‌లో మాత్రం డేనియల్ సామ్స్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్ తొలి రెండు బంతుల్లో డేనియల్ సామ్స్ సిక్సర్లు బాదాడు. దీని తర్వాత లాయిడ్ పోప్ వైడ్ బాల్ వేశాడు. తర్వాతి 4 బంతుల్లో డేనియల్ సామ్స్ 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. దీనితో సిడ్నీ థండర్స్ ఈ ఓవర్‌లో మొత్తం 31 పరుగులు రాబట్టింది. ఇక సిడ్నీకి చివరి ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే అవసరం కాగా.. 2 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

సిడ్నీ థండర్స్ విజయం..

ఈ సీజన్‌లో సిడ్నీ థండర్స్‌కి ఇది మొదటి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో డేనియల్ సామ్స్ 18 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు, ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ కూడా 27 బంతుల్లో 56 పరుగులతో రాణించాడు. కానీ ఈ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాత్రం 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *