సామాన్యులకు ఇది కదా కావాల్సింది.. రాజధాని అమరావతిలో గజం భూమి విలువ ఎంతో తెల్సా.?

సామాన్యులకు ఇది కదా కావాల్సింది.. రాజధాని అమరావతిలో గజం భూమి విలువ ఎంతో తెల్సా.?


ఏపీలో ఆరునెలల కిందట టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక్కసారిగా బెలూన్‌కు గాలి ఊదినట్లుగా.. ఏపీలో రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్లిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఇలా ఒక్కసారిగా గాలి కొడితే బెలూన్లు పేలిపోయినట్లు రియల్ ఎస్టేట్ అమాంతం పెరిగి పడిపోతుంది తప్ప.. దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అయితే మొదటిసారి అమరావతిని రాజధానిగా ఖరారు చేసినప్పుడు భూముల ధరలు ఫుల్ హైప్‌లోకి వెళ్లగా.. ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం అమరావతి రాజధాని పరిధిలో కనిపించడం లేదు.

కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా భూముల ధరల పెరుగుదలపై.. అమరావతి రాజధాని పరిధిలో రియల్ ఎస్టేట్‌పై ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా కూడా ఇప్పుడు ఓ క్రమ పద్దతిలో ముందుకు వెళ్తోంది. సీఆర్డీఏ పరిధిలో మధ్య తరగతికి అందుబాటులోనే ఇంటి ప్లాట్లు ఇప్పుడు లభిస్తున్నాయి. ల్యాండ్ పూలింగ్‌లో సేకరించిన రైతులకు వచ్చిన రిటర్న్ బుల్ ఫ్లాట్స్‌లో ధరలు పెరిగినా కూడా కొనుగోళ్లు, అమ్మకాలతో ఆయా భూముల్లో ఇప్పుడు లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల కిందటితో ఉన్న ధరలతో పోలిస్తే దాదాపు గజం భూమి ధర రెట్టింపు అయినా.. కానీ సముచితమైన ధరల్లోనే ఉన్నాయని రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం సిఆర్డిఏ రాజధాని గ్రామాల పరిధిలో 45 వేలకు పైగా గజం ఉంది. ఇక ప్రాంతాన్ని బట్టి ధరలు హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణ సంస్థలతో భేటీలు అవ్వడం.. పనులు ప్రారంభించి అంశంపై కసరత్తు చేస్తూ ఉండటంతో.. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. అమరావతి కోర్ క్యాపిటల్ పనులు జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆసియా బ్యాంక్‌తో పాటు ఇతర దేశాల నుంచి సైతం పెట్టుబడులు, ఆర్థిక సాయం కోరుతూ ఉండటంతో ఒకేసారి రాజధానిలో నలభై, యాభై వేల కోట్ల పనులు ప్రారంభం అవుతాయని.. త్వరలోనే భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తం అవుతుంది.

మరోవైపు సీఆర్డీఏ పరిధి విస్తరించి పూలింగ్‌లేని ప్రాంతాల్లో గతంలో వేసిన వెంచర్లలో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. విజయవాడ, గుంటూరు నగరాలు జంట నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. బెజవాడ పశ్చిమ బైపాస్ ఇప్పటికే ప్రారంభానికి సిద్ధంగా ఉండడం.. తూర్పు బైపాస్ నిర్మాణం కోసం ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేయడం.. అలాగే విజయవాడ, గుంటూరు నగరాల్లో ప్రభుత్వం అభివృద్ధి కోసం ప్రత్యేక రూపొందించడంతో సిఆర్డిఏ పరిధి విస్తరించి ఉంది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో సైతం భూముల కొనుగోళ్లకు సంబంధించి ఎంక్వయిరీలు కూడా పెరుగుతున్నాయి. వచ్చే మూడేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణాలతో ఒక కొలిక్కి వస్తుందని.. అప్పడు పూర్తిగా స్వరూపం మారిపోతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రైవేటు యూనివర్శిటీలు నిర్మాణం పూర్తి కాగా, త్వరలోనే ఆస్పత్రులు, ప్రవేట్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణం ఏకకాలంలో జరగనుంది.

దీంతో ఉపాధి కోసం వచ్చేవారు పెరుగుతారని ఇవన్నీ పరిశీలిస్తే ఇప్పటికీ సామాన్యులకు అమరావతిలో ఇళ్ల ఫ్లాట్ల ధరలు అందుబాటులో ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కాకపోయినా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరలు అమాంతం పెరిగాయి. అయితే త్వరలోనే రాజధాని నిర్మాణం పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడున్న గజం భూమి ధరకు మరో రెండు, మూడింతలు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు.

ఇది చదవండి: పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *