భారత్-ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి 4వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్ బోర్న్‌లోని ఎంసీజీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును స్పష్టించబోతున్నాడు. అది కూడా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టబోతున్నాడు.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మైదానంలో 10 ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ మొత్తం 449 పరుగులు చేశాడు.
అలాగే ఈ జాబితాలో అజింక్యా రహానే రెండో స్థానంలో ఉన్నాడు. మెల్బోర్న్ మైదానంలో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో 369 పరుగులు చేశాడు. దీంతో ఎంసీజీ యార్డ్‌లో అత్యధిక పరుగులు చేసిన 2వ భారత ఆటగాడిగా నిలిచాడు.
అలాగే ఈ జాబితాలో అజింక్యా రహానే రెండో స్థానంలో ఉన్నాడు. మెల్బోర్న్ మైదానంలో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో 369 పరుగులు చేశాడు. దీంతో ఎంసీజీ యార్డ్‌లో అత్యధిక పరుగులు చేసిన 2వ భారత ఆటగాడిగా నిలిచాడు.
ప్రస్తుతం 316 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో 134 పరుగులు చేస్తే అగ్రస్థానానికి చేరుకోవచ్చు. దీంతో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కవచ్చు.