వామ్మో.. మానవాళికి మరో పెనుముప్పు! ఆ ల్యాబ్‌ నుంచి ఏకంగా 100 ప్రాణాంతక వైరస్‌లు మిస్సింగ్..

వామ్మో.. మానవాళికి మరో పెనుముప్పు! ఆ ల్యాబ్‌ నుంచి ఏకంగా 100 ప్రాణాంతక వైరస్‌లు మిస్సింగ్..


కరోనా వైరస్‌ ప్రళయతాండవం ఇంకా కళ్లముందే మెదులుతుంది. చైనాలోని ఓ ల్యాబ్‌ నుంచి ఈ వైరస్‌ బయటకు రావడం వల్లనే ప్రపంచ వ్యాప్తగా కోట్లాది ప్రాణాలు గాల్లోకలిసి పోయినట్లు ఇప్పటికే పలు అధ్యయాలు వెల్లడించాయి కూడా. ఇలాంటి మరో ప్రాణాంతక వ్యాధి మళ్లీ మళ్లీ రాకూడదని యావత్‌ ప్రపంచం ఎన్నో దేవుళ్లకు మొక్కింది. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న జనాలకు మరో షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే తాజాగా మరో ల్యాబ్‌ నుంచి ఏకంగా వంద ప్రాణాంతక వైరస్‌లను గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించారు. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని అధికారులు వెల్లడించారు. అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ల్యాబ్‌ నుంచి హెండ్రా వైరస్‌తో సహా దాదాపు 100 ప్రాణాంతకమైన వైరస్ నమూనాలు చోరీకి గురైనట్లు తెలిపారు. ఈ బయోసెక్యూరిటీ ఉల్లంఘనపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

2021లో వైరాలజీ లేబొరేటరీలో జరిగిన ఈ సంఘటన సేఫ్టీ ప్రోటోకాల్స్‌లో అతిపెద్ద లోపంగా అభివర్ణించింది. క్వీన్స్‌ల్యాండ్ హెల్త్ నివేదికల ప్రకారం.. హెండ్రా వైరస్, లైసావైరస్, హాంటావైరస్ కలిగిన నమూనాలను నిల్వ చేసే ఫ్రీజర్ విచ్ఛిన్నం అయినట్లు గుర్తించారు. అందులో ఉన్న దాదాపు 100 శాంపిల్స్‌ కనిపించకుండా పోయినట్లు వెల్లడించింది. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ABC) మీడియా సమావేశంలో ఆరోగ్య మంత్రి టిమ్ నికోల్స్ ఈ విషయాన్ని తెలిపారు. ఇది ఆగస్ట్ 2023లో జరిగిందని చెప్పారు. అయితే వీటిని చోరీ చేశారా? పూర్తిగా నాశనం చేశారా? అన్న దానిపై ల్యాబ్ స్పష్టత ఇవ్వలేదు. ఈ శాంపిల్స్‌ కనబడకుండా పోయిన ల్యాబ్‌లో వివిధ వ్యాధికారక రోగనిర్ధారణ, పరిశోధన, నిఘాలకు సంబంధించిన వాటిపై రీసెర్చ్‌ జరుగుతుందని మంత్రి టిమ్ నికోల్స్ పేర్కొన్నారు.

ఇక్కడి ల్యాబ్‌ నుంచి వైరస్‌ శాంపిల్స్‌ చోరీకి గురైనప్పటికీ.. వాటివల్ల సమాజానికి ఎటువంటి ముప్పు లేదని చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జాన్ గెరార్డ్ తెలిపారు. కనబడకుండా పోయిన వైరస్‌ శాంపిల్స్‌ మనుగడకు అతితక్కువ ఉష్ణోగ్రతలు అవసరం. అలాంటి వాతావరణం లేకుంటే అవి చాలా వేగంగా క్షీణిస్తాయి. పైగా గత ఐదేళ్లుగా క్వీన్స్‌లాండ్‌లో హెండ్రా, లైసావైరస్ కేసులు ఒక్కటీ నమోదు కాలేదు. ఆస్ట్రేలియా ప్రజలకు హాంటావైరస్ ఇన్‌ఫెక్షన్లు సోకిన దాకలాలు కూడా లేవని డాక్టర్ గెరాడ్ తెలియజేశారు. అయినప్పటికీ మరికొందరు నిపుణులు మాత్రం ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చోరీకి గురైన వైరస్‌ శాంపిల్స్‌లో హాంటావైరస్ చాలా ప్రమాదకరమైనది. ఇది COVID-19 కంటే ఎక్కువ మరణాలకు దారి తీస్తుంది. మిగిలిన ట్యూబ్‌లలో లైసావైరస్ 223 నమూనాలు ఉన్నాయి. ఇది కూడా అధిక మరణాల రేటు కలిగించే రాబిస్‌ను పోలి ఉండే ఒక వైరస్. అలాగే హాంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (HPS)కి కారణమవుతుందని తెలిపారు. ఇది సుమారుగా 38 శాతం మరణాల రేటును కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెండ్రా వైరస్ జంతువుల నుంచి మానవులకు ప్రసారం చేయగల జూనోటిక్ వైరస్ మాదిరి పనిచేస్తుంది. రాబిస్‌తో కూడిన లైసావైరస్‌కు చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రాణాంతకం కావచ్చు. అలాగే US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం హాంటావైరస్ తీవ్రమైన అనారోగ్యాం, మరణానికి కూడా దారి తీస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ శాంపిల్స్‌ ఎలా మిస్సయ్యాయి.. ఇంత కాలం ఎందుకు కనిపించకుండా పోయాయి అనే కోణంలో మాత్రమే విచారణ జరుగుతోంది. అసలు సమస్యను పరిష్కరించామని ఆ దేశ ఆరోగ్య మంత్రి చెబుతున్నా.. వీటి వల్ల ఎట్నుంచైనా ప్రమాదం దాడి చేసే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *