వామ్మో..ఏం తెలివిరా బాబు.. గాజు సీసాలో గుట్టుగా బంగారం స్మగ్లింగ్‌..! కంగుతిన్న అధికారులు..

వామ్మో..ఏం తెలివిరా బాబు.. గాజు సీసాలో గుట్టుగా బంగారం స్మగ్లింగ్‌..! కంగుతిన్న అధికారులు..


ఢిల్లీ విమానాశ్రయం నుండి ఓ షాకింగ్ వీడియో తెరమీదకు వచ్చింది.. ఇందులో బంగారం స్మగ్లింగ్ ఆరోపణలపై ఏఐయూ బృందం ఓ ప్రయాణికుడిని అరెస్టు చేసింది. ఈ ఆరోపణలను సదరు ప్రయాణికుడు తీవ్రంగా ఖండించాడు. అయితే ఆ తర్వాత జరిగిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతని వద్ద లభించిన ఒక సీసాలోంచి ఏకంగా రూ.35 లక్షల విలువైన బంగారం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరల్‌ వీడియో ప్రకారం.. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం వచ్చి దిగింది. ఫ్లైట్ XY-329 సౌదీ అరేబియా రాజధాని రియాద్ నుండి న్యూఢిల్లీకి వచ్చిందని సమాచారం.. అదే విమానంలో 32 ఏళ్ల ప్రయాణికుడు ఒకరు ఉన్నారు. విమానం ల్యాండింగ్ తరువాత అతడు గ్రీన్ ఛానల్ గుండా వెళ్తూ అనుమానాస్పందంగా అధికారుల కంటపడ్డాడు. అతడిని విచారించగా అతని వద్ద ఉన్న ఓ బ్యాగ్‌లో ఒక బరువైన బాటిల్ కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులకు అతడిపై మరింత అనుమానం వచ్చింది. లగేజీని ఎక్స్‌రే పరిశీలించగా పోలీసులు కొన్ని అనుమానాస్పద చిత్రాలను గుర్తించారు. అందులో అతని బాటిల్‌పై అనుమానంతో దాన్ని పగులగొట్టారు. అప్పుడు కనిపించిన సీన్‌ చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. అక్కడి వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ సీసాలోపల వెండి పొర, పొరలుగా తయారు చేశారు. అంతేకాదు.. దాని లోపల బంగారం కూడా ఉండటం గుర్తించారు.

ఇవి కూడా చదవండి

వెండి కోటింగ్‌ గాజు సీసాలో బంగారు ముక్కను దాచి ఉంచడం వీడియోలో కనిపిస్తుంది. బరువును పరిశీలించగా దాని బరువు 467 గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. అంటే ఈ బంగారం 24 క్యారెట్లు, దీని విలువ రూ.34.67 లక్షలుగా తేల్చారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పట్టుబడిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ నివాసిగా గుర్తించారు. అతను సౌదీ అరేబియా నుండి అక్రమంగా బంగారంతో భారతదేశానికి వచ్చాడని పోలీసులు వివరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *