వాటే ఐడియా సర్ జీ.. కొండెంగ ఫ్లెక్సీలతో కోతులకు చెక్‌ పెడుతున్న తీరు చూస్తే అవాక్కే..!

వాటే ఐడియా సర్ జీ.. కొండెంగ ఫ్లెక్సీలతో కోతులకు చెక్‌ పెడుతున్న తీరు చూస్తే అవాక్కే..!


కరీంనగర్ సమీపంలో గతంలో ఎత్తైనా కొండలు ఉండేవి. ఆ కొండల్లో కోతులు తిష్టవేసేవి. రెండు దశాబ్దాల నుండి గ్రానైట్ వ్యాపారం వేగంగా విస్తరించింది. దీంతో కొండలన్నీ కరిగిపోయాయి. ఈక్రమంలో కొండలలో ఉండే కోతులన్నీ నగరంలోకి ప్రవేశించాయి…ఇప్పుడు వాడవాడలా కోతుల ఖ్య పెరిగిపోయింది. భగత్ నగర్ ,తిరుమలనగర్, లక్ష్మీనగర్ ,హౌజింగ్ బోర్డు కాలనీలలో వీటి సంచారం ఎక్కువగా ఉన్నది.లక్ష్మీనగర్ లో
గేట్ల పైనే తిష్టవేసి ఎటూ వెళ్ళాకుండా యజమానులను భయపెట్టిస్తున్నాయి.

గతంలో కొన్ని రోజులు కొండముచ్చును తిప్పారు. అప్పుడు తాత్కలిక‌ విముక్తి లభించింది. అయితే అ కొండముచ్చును మెయింటనెన్స్ చేయలేకపోవడంతో అక్కడి నుండి తరలించారు. కొండముచ్చు స్థానంలో కొండముచ్చు ఫ్లేక్సీలను ఏర్పాటు చేయాలని లక్ష్మీనగర్ వాసులు నిర్ణయించారు. దీనితో ప్రతి‌ ఇంటి గేటు ఎదుట కొండముచ్చు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. గత వారం రోజుల నుండి కూడా కోతుల సంచారం తగ్గింది. ఒకరిని చూసి మరోకరు గేటు ఎదుట కొండముచ్చు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు.

ఈ కొండముచ్చు బొమ్మలు కూడ కోతిని భయపెట్టె విధంగానే అహాభావాలు  కలిగి ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. కోతులు కూడ ఆ ఫ్లెక్సీలని చూసి భయంతో పరుగులు తీస్తున్నాయి. గేటు మొత్తం ఫ్లెక్సీలను కట్టారు.ఎప్పుడైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారో అప్పటినుండి కోతుల బెడద తగ్గిందని కాలనీ వాసులు చెబుతున్నారు.  లక్ష్మీనగర్ వాసులు ఈ ఫ్లెక్సీల కారణంగా కాస్తా ఊపిరి పీల్చుకొని ఎలాంటి భయం లేకుండా ఇంట్లో కి వెళుతున్నామని అంటున్నారు.

ఈ కాలనీలలో పెద్ద ఎత్తున్న కొతుల సంచారం ఉన్నదని స్థానికులు చెబుతున్నారు. బయటికి రావాలంటేనే భయపడే వారిమని అంటున్నారు. గుంపులు గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో కొండముచ్చు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కోతుల బెడదల నుండి విముక్తి అయ్యామని తెలుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *