లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వచ్చేసింది. బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా.. ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇక IND కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. అటు లోక్‌సభలో తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేసింది. జమిలి బిల్లు కోసం మోదీ సర్కార్ ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తోంది. బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపబోతోంది ప్రభుత్వం. కమిటీలో బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు పలు పార్టీలకు చోటు కల్పిస్తారు.
ఒకే దేశం – ఒకే ఎన్నిక నినాదాన్ని కొన్నేళ్లుగా వినిపిస్తున్న మోదీ సర్కార్, ఇందుకోసం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రామ్‌నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటుచేయడం, ఆ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగిపోయాయి. ఈ ప్రతిపాదన ఇప్పుడు బిల్లు రూపంలో దిగువసభకు వస్తోంది. ఈ బిల్లు పాస్ కావడం కోసం మోదీ ప్రభుత్వం విపక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో ఉంది. ఇందుకోసం JPCని ప్రకటించే అవకాశం ఉంది. జమిలి బిల్లును JPC పరిశీలించడానికి తొలుత 90 రోజుల సమయం ఇస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి, కాలవ్యవధిని పొడిగించే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..