రోడ్డు ప్రమాదంతో గాయపడి మృతి చెందిన గోవును చూసి, ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది.. ఎందుకో తెలుసా?

రోడ్డు ప్రమాదంతో గాయపడి మృతి చెందిన గోవును చూసి, ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది.. ఎందుకో తెలుసా?


సొంత వాళ్లు చనిపోతే కూడా పట్టించుకోని ఈ రోజుల్లో.. రోడ్డు మీద వదిలేస్తున్న చాలా మందిని చూస్తున్నాం. నిత్యం తమ కళ్ళ ముందు తిరిగాడే మూగ జీవి రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందింది. ఆ మూగ జీవికి మనుషుల మాదిరిగా గ్రామస్తులు ఘనంగా అంత్యక్రియలు చేశారు. సంప్రదాయబద్ధంగా దానికి ఊరంతా కలిసి ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

నల్లగొండ జిల్లా కేతేపల్లిలోని శంభులింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ సమయంలో 16 ఏళ్ల క్రితం భక్తులు గోవును ఆలయానికి బహూకరించారు. నిత్యం గ్రామస్తులు దానికి రోజూ ఆహారం పెట్టేవారు. ఏ ఇంటి వద్దకు వెళ్లినా తమ సొంత గోమాతగా భావించి, తమ ఇంటిలో ఉన్న పదార్థాలను అందిస్తూండేవారు. ఇలా కొంతకాలంగా ఆ గ్రామస్థులకు గోవు దగ్గరయ్యింది. ఈ గోవును గ్రామస్తులు శివుడికి ప్రతిరూపంగా భావించేవారు. గ్రామస్తుల మధ్య నిత్యం తిరిగాడేది ఆ గోవు.

అయితే, నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని దాటుతుండగా బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. గ్రామస్తులు పశు వైద్యుడిని పిలిపించి గోవుకు చికిత్స చేయించారు. అయినా పరిస్థితి విషమించి గోవు మృతి చెందింది. సాధారణంగా ఏదైనా జంతువు మరణిస్తే.. దానికి దూరంగా వెళ్లిపోతాం. పారిశుద్ధ్య కార్మికులు వచ్చి దానిని.. పూడ్చేసేదాకా అస్సలూ పట్టించుకోం. కానీ ఈ గ్రామస్తులు మాత్రం కంటతడిపెట్టి.. మనుషులకు చేసిన విధంగా మూగ జీవికి ఘనంగా అంత్యక్రియలు చేశారు. ట్రాక్టర్‌పై గోవు మృతదేహాన్ని ఉంచి, కొత్త వస్త్రాలు పెట్టి, బాణసంచా కాలుస్తూ గ్రామంలో ఊరేగించారు. గ్రామ శివారులో హిందూ సాంప్రదాయం ప్రకారం గోవును ఖననం చేశారు. ఈ అంత్యక్రియలు శివాలయ కమిటీ చైర్మన్ అలుగుబెల్లి కేశవరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *