‘రోజంతా తింటూ కూర్చోకపోతే ఏదైనా జాబ్ చేయొచ్చుగా’ ప్రేయసి హేళన.. ప్రియుడి సూసైడ్‌

‘రోజంతా తింటూ కూర్చోకపోతే ఏదైనా జాబ్ చేయొచ్చుగా’ ప్రేయసి హేళన.. ప్రియుడి సూసైడ్‌


నోయిడా, డిసెంబర్‌ 14: నేటి యువత ప్రేమ పేరిట లివ్‌ ఇన్ రిలేషన్‌షిప్‌లు కొనసాగిస్తున్నారు. ఆనక గొడవలు పెట్టుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు. పెళ్లి బంధం ఇలాంటి తాత్కాలిక రిలేషన్‌షిప్‌ల వల్ల నవ్వులపాలవుతుంది. తాజాగా ఓ జంట సిటీకి వచ్చి పెద్దలకు తెలియకుండా లివ్‌ ఇన్ రిలేషన్‌షిప్‌ దుకాణం పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన ఆ తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రియుడికి ఉద్యోగం సద్యోగం లేదని.. రోజంతా ఇంట్లో కూర్చుని తింటున్నాడని తరచూ ప్రేయసి దెప్పిపొవడంతో మనస్థాపానికి గురై సూసైడ్‌ చేసుకున్నాడు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

యూపీలోని జలాలబాద్‌కు చెందిన మయాంక్‌ చాందేల్‌ (27) అనే యువకుడు ఓ యువతితో కలిసి చదువుకునే వాడు. తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. ఆమెకు ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం రావడంతో.. వీరిద్దరూ గత నాలుగేళ్లగా సహజీవనం చేయడం ప్రారంభించారు. నోయిడాలోని సెక్టార్ 73లోని శౌర్య బాంక్వెట్ హాల్ సమీపంలో ఓ ఫ్లాట్‌లో వీరు నివాసం ఉంటున్నారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు మయాంక్‌కు సహ జీవనం చేస్తున్న మహిళ నుంచి వేధింపులు, అవహేళనలు ప్రారంభమయ్యాయి. వీటిని భరించలేక తాను నిరుద్యోగన్న కారణం వల్లనే తన ప్రేయసి తనను తిడుతుందని మనస్తాపం చెందిన యువకు ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం అతను సహజీవనం చేస్తున్న యువతి ఫ్లాట్‌లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రేయసికి సమాచారం అందించారు. సెక్టార్ 113 పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్‌ బృందం మయాంక్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చందేల్‌లో ఉంటున్న అతడి కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందించారు.

ఫ్లాట్‌లో మయాంక్‌ రాసిన సూసైడ్‌ నోట్ కూడా లభ్యమైంది. అందులో ‘రోజంతా కూర్చుని ఇంట్లో తింటూ కూర్చోకపోతే ఏదైనా పని చూసుకోవచ్చు కదా’ అని తనతో సహ జీవనం చేస్తున్న మహిళ నిత్యం ఈసడించేదని, దీంతో ఉద్యోగం దొరక్క, భాగస్వామి నుంచి అవహేళనలు, వెక్కిరింపుల వల్ల కలిగే తీవ్ర మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *