రీల్స్‌ పిచ్చితో వెర్రీ వేషాలు.. ఔటర్‌రోడ్డు వెంట నోట్ల కట్టలు విసిరేస్తూ హల్‌చల్‌.. కట్‌చేస్తే..

రీల్స్‌ పిచ్చితో వెర్రీ వేషాలు.. ఔటర్‌రోడ్డు వెంట నోట్ల కట్టలు విసిరేస్తూ హల్‌చల్‌.. కట్‌చేస్తే..


రీల్స్‌ పిచ్చితో యువత ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా పోయింది. కొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర స్టంట్స్‌ చేస్తుంటే, మరికొందరు ఎదుటి వారిని ప్రమాదంలోకి నెట్టేస్తు్నారు. ఇక కొందరు అవతలి వ్యక్తుల మనోభావాలతో ఆడుకోవాలని చూస్తున్నారు. అలాంటి పని చేసిన ఓ వ్యక్తికి హైదరాబాద్‌ పోలీసులు తగిన గుణపాఠం చెప్పారు. నగరంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో రీల్స్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం బాలానగర్ కు చెందిన యూట్యూబర్ భానుచందర్ అనే యువకుడు మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో రీల్స్ చేశాడు. ఇందులో భాగంగా అతడు నోట్ల కట్టలు చేతిలో పట్టుకుని హైవేపై అడ్రస్‌ చెప్పి మరీ చెట్ల పొదల్లోకి ఆ నోట్లను విసిరేశాడు. చేతిలో నోట్ల కట్టలు పట్టుకుని రూ.20వేలు రోడ్డు పక్కన విసిరేశాడు. ఇదంతా వీడియో రికార్డ్‌ చేసుకుని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్‌ చేశాడు. వీడియో చూసినవారు ఎవరైనా సరే.. వచ్చి తీసుకోవచ్చని ప్రకటించాడు. అది కాస్త వైరల్‌గా మారడంతో వీడియో పోలీసులకు చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు చర్యలకు సిద్ధపడ్డారు.

ఇలా ఔటర్‌ రోడ్డుపై ఇలా డబ్బుల కట్టలు విసిరేయటం చూసిన జనాలు.. ఆ డబ్బుల కోసం ఓఆర్‌ఆర్‌ పైకి భారీగా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రమాదాలు సైతం జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ఈ విషయంలో సీరియస్‌ యాక్షన్‌కు రంగం సిద్ధం చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *