రాధాకృష్ణులతో పాటు కొలువైన రుక్మిణి.. ఝాన్సీ లక్ష్మిభాయి పూజించిన ప్రేమాలయం ఎక్కడంటే..

రాధాకృష్ణులతో పాటు కొలువైన రుక్మిణి.. ఝాన్సీ లక్ష్మిభాయి పూజించిన ప్రేమాలయం ఎక్కడంటే..


హిందూ మతంలో రుక్మిణీ అష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీ కృష్ణుడు, రుక్మిణి దేవిని పూజిస్తారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి రుక్మిణీ అష్టమిగా జరుపుకుంటారు. పంచాగం ప్రకారం రుక్మిణీ అష్టమి ఈ సంవత్సరం డిసెంబర్ 22 న జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీ కృష్ణుడు, రుక్మిణి దేవిని పూజిస్తారు. దీనితో పాటు ఉపవాసం కూడా ఉంటారు.

రుక్మిణి రాధా-కృష్ణులతో కలిసి ఉన్న ఆలయం

హిందూ మత గ్రంధాలలో రుక్మిణి దేవిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. రుక్మిణీ దేవి శ్రీ కృష్ణుని ప్రధమ భార్య. అయితే ఎక్కువగా ఇంటి పూజా గదిలో లేదా ఆలయాల్లో రాధాకృష్ణులను మాత్రమే పూజిస్తారు. అయితే మనం దేశంలోని ఓ ఆలయంలో రాధా కృష్ణులతో పాటు అతని భార్య రుక్మిణి దర్శనం కూడా పొందవచ్చు. దేశంలో ఇలా ముగ్గురు కలిసి ఉన్న తొలి ఆలయం ఇదేనని కూడా పేర్కొంటున్నారు. ఇక్కడ రుక్మిణీ అష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుతారు.

ఈ ఆలయం ఝాన్సీలో ఉంది

ఈ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఉంది. ఝాన్సీలోని బడా బజార్‌లోని మురళీ మనోహర దేవాలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో భక్తులు శ్రీకృష్ణుడు రాధా, రుక్మిణిలు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు మధ్యలో ఉండగా ఒకవైపు రాధా, మరొక వైపు రుక్మిణి కొలువుదీరి ఉన్నారు. రాధా కృష్ణ రుక్మిణిల దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

ఆలయ చరిత్ర ఏమిటంటే

ఈ దేవాలయం సుమారు 250 సంవత్సరాల నాటిదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాన్ని స్వాతంత్ర్య పోరాట యోధురాలు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అత్తగారు సక్కు బాయి నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని 1780 సంవత్సరంలో నిర్మించాడు. మొదట్లో సక్కు బాయి గుడిలో పూజలు చేసేది. 1842లో ఝాన్సీ రాజా గంగాధరరావుతో రాణి లక్ష్మీబాయి వివాహం జరిగిన తర్వాత.. లక్ష్మి బాయి కూడా పూజలను చేయడానికి ఈ ఆలయానికి వెళ్ళేదట. ఝాన్సీలో ఈ ఆలయాన్ని ప్రేమకు చిహ్నంగా కూడా పూజిస్తారు. అయితే ఈ ఆలయంలో రాధా-కృష్ణులతో పాటు రుక్మిణిదేవిని ఎందుకు పెట్టారు..? ఎందుకు పూజిస్తున్నారు అనే విషయం గురించి సరైన సమాచారం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *