టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు ఇలా వచ్చారు.. అలా మాయమైపోయారు. కానీ కొందరే చేసేవి తక్కువ సినిమాలే అయినప్పటికీ.. తమ మార్క్ వదిలి వెళ్తుంటారు. అలాంటి ముద్దుగుమ్మల్లో ఒకరు ఈ అందాల భామ ఒకరు.
ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో ఈ బ్యూటీ నటించింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది.ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ వయ్యారి భామ . ఇంతకూ తాను ఎవరంటే.
ఎన్టీఆర్ సరసన నటించిన ఈ బ్యూటీ మరెవరో కాదండీ.! మంజరీ ఫడ్నిస్. అల్లరి నరేష్‌తో ‘సిద్దూ ఫ్రం శ్రీకాకుళం’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో హద్దులు లేని అందాల ఆరబోత ఒలకబోసి.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది.
ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు కె. విశ్వనాధ్ తెరకెక్కించిన ‘శుభప్రదం’ అనే మూవీలో మెరిసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ కాకపోయినా.. మంజరీ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అనంతరం యంగ్ టైగర్ సరసన ‘శక్తి’ సినిమాలో కనిపించింది.
హిందీ, మరాఠీ భాషల్లో పలు చిత్రాల్లో నటించడమే కాదు.. వెబ్ సిరీస్‌లలోనూ తళుక్కుమన్నది ఈ చిన్నది. కొన్ని హిట్ చిత్రాలను కూడా తన ఖాతాలో వేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అందాలతో అదరగొడుతుంది.