మీ పిల్లలకు ఆస్తిపాస్తులు ఇస్తారో లేదో.. ఈ విలువలు నేర్పండి చాలు!

మీ పిల్లలకు ఆస్తిపాస్తులు ఇస్తారో లేదో.. ఈ విలువలు నేర్పండి చాలు!


పిల్లలకు మనం ఎన్నో విషయాలు నేర్పిస్తాం. మనం నేర్పించే అంశాలతోనే వారికి సమాజంతో ఎలా మెలగాలో అవగాహన వస్తుంది. అయితే ఎక్కువ మంది తమ పిల్లలకు చాలా విషయాలు నేర్పిస్తున్నా ఆధ్యాత్మిక అంశాలు, అలవాట్లపై అవగాహన కల్పించడం లేదు. మేధస్సు, భావోద్వేగాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలను వారికి పరిచయం చేయగలిగితే వారిలో కనికరం, దయ వంటి గుణాలు అలవడుతాయి. అలాంటి కొన్ని అలవాట్లను ఇక్కడ మనం పరిశీలిద్దాం.

ధన్యవాదాలు చెప్పడం

ఇతరుల నుంచి మనకు ఏదైనా లభించినప్పుడు వారికి కృతజ్ఞతలు చెబితే ఎదుటివారు సంతోషం వ్యక్తం చేస్తారు. ఈ పని పిల్లలు చేస్తే మరింత ఉత్సాహానిస్తుంది. ఇది పిల్లలకు రోజువారీ అలవాటుగా నేర్పించాలి. ప్రాక్టీస్​ చేయించాలి.

దయాగుణం

పిల్లలు ఇతరులతో ప్రేమతో నడుచుకునేలా అలవాటు చేయాలి. దయతో కూడిన ప్రతి చర్య.. స్నేహితుడికి సాయం చేయడం లేదా చెత్తను తీయడం వంటివి మంచి ప్రభావాలను కలిగిస్తాయి. ఎవరినైనా మెచ్చుకోవడం, ఇతర పిల్లలతో కలిసి బొమ్మలను పంచుకోవడం వంటి అంశాలను వారిని నిత్యం నేర్పిస్తూ ఉండాలి. ఇలాంటి చర్యలు పిల్లల్లో ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.

ధ్యానం, ద్యాస

బుద్ధి మానవులకు సూపర్​ పవర్​. ఈ క్షణంపై దృష్టి పెట్టేలా పిల్లలను చిన్నప్పటి నుంచే ట్రైయిన్​ చేయాలి. ధ్యానం, ఇంద్రియాలపై నియంత్రణ వంటి అంశాలను నేర్పించాలి. ఇలా చిన్నప్పటి నుంచి చేస్తే వారి చుట్టు ఉన్న ప్రపంచంతో ప్రశాంతంగా జీవించగలరు.

క్షమాగుణం

పిల్లలకు నేర్పించాల్సిన అంశాల్లో క్షమాగుణం ఎంతో ముఖ్యమైనది. కోపం, ఆగ్రహాలు వారి హృదయాన్ని బరువుగా మారుస్తాయి. క్షమాగుణం అలవడితే మనసును తేలికపరిచేందుకు సాయం చేస్తుంది. పిల్లలు తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడం, ఇతరులు తప్పు చేసినప్పుడు క్షమించడం వారికి నేర్పాలి.

ఇతరులపై సానుభూతి చూపడం

ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు వారిని గుర్తించడంలో ఈ చర్య దోహదపడుతుంది. ఇతరులకు కష్టం వచ్చినప్పుడు ప్రతిస్పందించడం పిల్లలకు నేర్పించాలి. విచారంగా ఉన్న స్నేహితుడిని ఓదార్చడం, పడిపోయినప్పుడు సాయం చేయడం వంటి చర్యలు పిల్లల మధ్య దృఢమైన స్నేహాన్ని ఏర్పరుస్తాయి. ఇతరుల పట్ల శ్రద్ధ వహించేలా ప్రోత్సహించడం వల్ల ఇలాంటి గుణం అలవడుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *