మరో అంతుచిక్కని వ్యాధి.. సోకిందంటే డ్యాన్స్ చేసినట్టు వణికిపోతారు..

మరో అంతుచిక్కని వ్యాధి.. సోకిందంటే డ్యాన్స్ చేసినట్టు వణికిపోతారు..


ఉగాండాను కొత్త మహమ్మారి భయపెడుతోంది. ఆ మహమ్మారి పేరు డింగా.. డింగా.. అంటే డ్యాన్స్ చేస్తున్నట్టు వణికిపోవడమని అర్ధం. ఆ దేశంలో ఈ కొత్త రోగం పుట్టుకొచ్చింది. కొన్నిరోజులుగా వేధిస్తున్న ఈ వ్యాధితో అక్కడి ప్రభుత్వం తలపట్టుకుంది. ఎందువల్ల వస్తుందో, ఏ మందులు వాడాలో తెలియదు. 300కి పైగా కేసులు నమోదవ్వడంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. రోగం వచ్చిందంటే చాలు నియంత్రణ లేకుండా ఒళ్లు ఊగిపోతుంది.

జ్వరం, వీక్‌నెస్, పక్షవాతం వచ్చిన ఫీలింగ్ దీని లక్షణాలు. కొందరు నడవలేకపోతున్నారు. దీనిపై జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఉగాండాలోని బుండిబాగ్యో ప్రాంతంలో ఈ మిస్టరీ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధితో ఇప్పటిదాకా ఎలాంటి మరణం సంభవించలేదు. అలాగే ఈ వ్యాధిని నియంత్రించేందుకు వైద్యులు యాంటీబయాటిక్స్‌ సాయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. డింగా డింగా వ్యాధితో బాధపడుతున్న రోగులు వారం రోజుల్లో కోలుకుంటారట.

అటు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కూడా మరో వింత వ్యాధి ప్రబలుతోంది. ఈ వ్యాధి కారణంగా అక్కడి ప్రజలు జ్వరం, తలనొప్పి, దగ్గు, ముక్కు కారడం, శరీరమంతా నొప్పులు వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారు. కాంగోలో 400 మందికి పైగా ఈ వ్యాధి బారినపడ్డారు. జ్వరం, పక్షవాతం, వారి శరీరం అనియంత్రిత, వణుకు మొదలవడం వంటి లక్షణాలు ఉన్నాయట.(Source)

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *