2024వ సంవత్సరం చివరి నెల జరుగుతోంది. వారం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ నేపధ్యంలో పర్యాటకులు క్రిస్మస్ వేడుకల కోసం.. నూతన సంవత్సరానికి ఘన స్వాగతం చెప్పడానికి వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా పర్వత ప్రాంత ప్రదేశాలకు క్యూ కడుతున్నారు. ఈ నేపధ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి నుంచి వెలుగులోకి వచ్చిన వీడియో చూపరులకు షాక్ కలిగిస్తుంది. మనాలిలోని సోలాంగ్ నాలా నుంచి అటల్ టన్నెల్ వరకు 1000కు పైగా వాహనాలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. డీఎస్పీ మనాలి, ఎస్‌డీఎం మనాలి, ఎస్‌హెచ్‌ఓ మనాలి పోలీసు బృందం సంఘటనా స్థలంలోకి చేరుకొని ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
హిమాచల్‌లోని చాలా జిల్లాల్లో వాతావరణం చాలా దారుణంగా ఉందని అంటే ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోయాయని చెబుతున్నారు. భారీ హిమపాతం, వర్షం కురుస్తుంది. చాలా చోట్ల మంచు కురుస్తోంది. సిమ్లా, మనాలిలో కూడా మంచు కురుస్తోంది. రోడ్డుపై తెల్లటి దుప్పటిని పరచినట్లు కనువిందు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డుపై వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రోడ్డుపై పేర్కొన్న మంచును తొలగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పర్వతాలలో భారీ హిమపాతం
పర్యాటకులు క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ కోసం పర్వత ప్రాంతాలకు వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో భారీ సంఖ్యలో పర్యాటకులు సిమ్లా-మనాలి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనాలిలో ఎక్కడ చూసినా వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం కురిసిన మంచు కారణంగా సోలాంగ్ నాలా నుంచి అటల్ టన్నెల్ వరకు వెయ్యికి పైగా వాహనాలు నిలిచిపోయాయి.
Due to heavy snowfall, Many vehicles are stuck from Solang nallah to Atal tunnel in #Manali. Police officials have reached the spot and are carrying out a rescue operation to evacuate the vehicles. pic.twitter.com/krIm4GrVUh
— Nikhil Choudhary (@NikhilCh_) December 23, 2024
700 వాహనాలను జామ్ నుంచి విడిపించారు
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, పరిపాలన అధికారులు వెంటనే మనాలి పోలీసు బృందంతో పాటు డీఎస్పీ, ఎస్‌డీఎం, ఎస్‌హెచ్‌ఓ ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ ట్రాఫిక్‌ను చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు. ప్రస్తుతం పోలీసు బృందం జామ్ క్లియర్ చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఇప్పటి వరకు 700 వాహనాలను బయటకు తీశారు.
హిమపాతాన్ని చూసిన పర్యాటకుల ముఖాల్లో సంతోషం
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సోమవారం మరోసారి మంచుతో కప్పబడింది. హిమపాతం కురుస్తోండడంతో పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా ఉండగా.. స్థానిక ప్రజలు, పర్యాటక రంగ పరిశ్రమతో ముడిపడిన వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. చలి గాలుల మధ్య మంచు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. నగరంలోని రిడ్జ్, మాల్ రోడ్డుపై మంచు కురుస్తున్న దృశ్యాలను పర్యాటకులు ఆస్వాదించారు.
హిమాచల్‌లో ఎక్కడ మంచు కురుస్తుందంటే
సమీప పర్యాటక ప్రాంతాలైన మనాలి, కుఫ్రి, నరకందతో పాటు ఖడపత్తర్, చుర్ధార్, చన్షాల్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో కూడా మంచు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు. సోమ, మంగళ, శుక్ర, శనివారాల్లో మధ్య, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు, మంచు కురుస్తాయని స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసింది.
హిమపాతం కురుస్తుండడంతో రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్యను పెంచుతుందని.. ఇది స్థానిక పర్యాటక వ్యాపారాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. హిమపాతం కారణంగా పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల హోటల్ బుకింగ్స్ కూడా పెరిగే అవకాశం ఉందని స్థానిక హోటల్ వ్యాపారి సుశాంత్ నాగ్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..