భారతదేశం చాలా కాలంగా టీబీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. అయితే ఇప్పుడు భయం కలిగించే టీబీకి సంబంధించి ఒక అధ్యయనం బయటకు వచ్చింది. PLoS మెడిసిన్ జర్నల్ అధ్యయనం ప్రకారం మన దేశంలో 2021 నుంచి 2040 వరకు రెండు దశాబ్దాలలో 6 కోట్ల TB కేసులు నమోదు కావచ్చు అని.. 80 లక్షల మరణాలు సంభవించవచ్చని అంచనా వేయబడింది.
అధ్యయనం ప్రకారం ఈ వ్యాధి కారణంగా భారతదేశం భారీగా ప్రాణనష్టాన్ని చవిచూడడమే కాదు ఆస్తి నష్టాన్ని కూడా చవిచూస్తుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 146 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీని వల్ల తక్కువ ఆదాయం కలిగిన మధ్యతరగతి కుటుంబాలు మరింత ఇబ్బందులకు గురవుతాయని UKలోని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు తెలిపారు. మధ్య తరగతి వారు ఆరోగ్య సంబంధిత భారాన్ని మోయడానికి తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది.
TB అంటే ఏమిటి?
క్షయ ఒక బాక్టీరియా వ్యాధి.ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు బ్యాక్టీరియా గాలిలో వ్యాపిస్తుంది. అప్పుడు ఇతర వ్యక్తులు కూడా సోకవచ్చు. ఈ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. వ్యాధి తీవ్రతమైనప్పుడు ఊపిరితిత్తులతో పాటు మిగిలిన శరీరాన్ని కూడా ప్రభావితం అవుతుంది.
ఈ వ్యాధిని ఆదిలోనే గుర్తిస్తే.. టీబీ నయం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒకవేళ క్షయను సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోకపొతే ప్రాణాపాయం కూడా సంభావించవచ్చు. ఈ వ్యాధి సాధారణ లక్షణాలు నిరంతర దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం, అలసట.
TBని ఎలా తగ్గించవచ్చు?
ప్రస్తుతం ఎవరికైనా TB ఉందా లేదా అని గుర్తించే రేటు మెరుగుపడింది. ప్రస్తుతం 63 శాతం కేసులు నమోదయ్యాయి. 95 శాతం ప్రభావవంతమైన TB చికిత్స, కేసు గుర్తింపుతో TB వలన ఏర్పడే ఆర్ధిక భారం 78-91 శాతం వరకు తగ్గుతుందని.. అంటే ఆర్థిక భారం $124.2 బిలియన్ల వరకు తగ్గుతుందని పరిశోధకులు చెప్పారు.
TBతో పోరాడటానికి.. టీబీ నుంచి విముక్తి దేశంగా మార్చడానికి 2000 సంవత్సరం నుంచి నిరంతరం నిధులు సమీకరిస్తునే ఉన్నారు. అయితే ఇది ఇప్పటికీ ప్రపంచ ఫైనాన్సింగ్ లక్ష్యం కంటే చాలా తక్కువగా ఉందని పరిశోధకుడు చెప్పారు. అలాగే టీబీ కేసును ముందస్తుగా గుర్తించడం, మెరుగైన జీవన విధానం, నిరంతర మందులు తీసుకోవడం, సమర్థవంతమైన చికిత్స అందించడం ద్వారా టీబీ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు అని పరిశోధనలు చెబుతున్నాయి.
పరిశోధకులు ఏం చెప్పారంటే?
పరిశోధన కోసం పరిశోధకులు భారతదేశంలో ఆర్థిక, ఆరోగ్యం, జనాభాపై TB ప్రభావాన్ని పరిశోధించే నమూనాను సిద్ధం చేశారు. 2021 నుంచి 2040 వరకు భారతదేశంలో TB వ్యాధికి సంభందించిన స్థూల ఆర్థిక భారం 62.4 మిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. రానున్న 20 ఏళ్లలో 8 మిలియన్ TB సంబంధిత మరణాలు, 146.4 బిలియన్ రూపాయల GDP నష్టపోతుందని తాము అంచనా వేసినట్లు పరిశోధకులు తెలిపారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..