వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. ఆ నష్టాలను పూడ్చుకోవడానికి నేరాలకు పాల్పడుతూ వచ్చారు. కార్లను అద్దెకు తీసుకుని వాటిని తనఖా పెట్టి డబ్బు తీసుకున్నారు. లిఫ్ట్ అడిగి మార్గమధ్యలో డ్రైవర్ ను బురిడీ కొట్టించి కార్లను అపహరించారు. బైకులను నకిలీ తాళాలతో తీసి చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్టోబర్ 27న సూర్యాపేటకు చెందిన మర్రు వెంకటేశ్వర్రావు విజయవాడలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు తన కారులో బయలుదేరాడు. కొత్త బస్టాండ్ సమీపంలో ప్రసాద్, నర్సింగ రావులు లిఫ్ట్ అడిగి వెంకటేశ్వర్రావు కారులో ఎక్కారు. మార్గమధ్యలో కారు యజమాని ఫోన్ నెంబరును నిందితులు తీసుకుని వారి నెంబరును వెంకటేశ్వరరావుకు ఇచ్చారు. విజయవాడకు వెళ్లగానే కారును రోడ్డు పక్కన ఆపి ఓ దుకాణంలో మిఠాయి కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ప్రసాద్, నర్సింగరావులు ఆ కారుతో ఉడాయించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు..
ప్రైమ్ యూజర్లకు షాకిచ్చిన అమెజాన్.. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి
చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!