బాబోయ్..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.? ఆమె బయట ఎలా ఉంటుందో చూస్తే అవాక్ అవ్వాల్సిందే

బాబోయ్..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.? ఆమె బయట ఎలా ఉంటుందో చూస్తే అవాక్ అవ్వాల్సిందే


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఇప్పుడు అభిమానులంతా రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా పై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ అభిమానుల అంచనాలను సినిమా రీచ్ అవ్వలేకపోయింది. మహేష్ బాబు సింగిల్ మ్యాన్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే మహేష్ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.  ఇంతవరకు పాన్ ఇండియా సినిమా చేయనప్పటికీ మహేష్ కు దేశవ్యాప్తంగానే కాదు ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో మహేష్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. తమకు కాబోయేవాడు మహేష్ లా హ్యాండ్సమ్ గా ఉండాలని కోరుకుంటుంటారు. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే .. రాజమౌళి మూవీ షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు నయా లుక్ లో కనిపించనున్నారు.

ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట

సూపర్ స్టార్ నటించిన సినిమాల్లో ఖలేజా సినిమాకు మంచి క్రేజ్ ఉంది. అంతే కాదు ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినీ సెలబ్రెటీలు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు.  ఖలేజా సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. అప్పుడు ఖలేజా కు మిక్స్డ్ టాక్ వచ్చింది. అసలు ఖలేజా సినిమా ఎందుకు ఆడలేదు కూడా చాలా మందికి అర్ధం కాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో డైలాగ్స్, మహేష్ బాబు యాటిట్యూడ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. అలాగే ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం నెక్స్ట్ లెవల్. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో అనుష్క నటించింది. కాగా ఈ సినిమాలో కొంత భాగం రాజస్థాన్ లో జరుగుతుంది.

ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..

టాక్సీ డ్రైవర్ అయినా హీరో.. తన కారుపై పడి చనిపోయిన దిలావర్ సింగ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలవడానికి రాజస్థాన్ వెళ్తాడు. కాగా ఈ సీన్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.కొంతమంది ఈ సినిమాలో దిలావర్ సింగ్ భార్యగా నటించిన నటి గురించి ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు సంబందించిన వీడియోలు, ఆమె ఎవరో చెప్పండ్రా అంటూ చేసిన ఫన్నీ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆమె కోసం కుర్రాళ్ళు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో గాలించారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె పేరు దివ్య మేరీ సిరియాక్. ఆమె గతంలో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ.

ఇది కూడా చదవండి : సమంత, శోభిత.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా…? మీరు అస్సలు ఊహించలేరు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *