విజయ్ హజారే ట్రోఫీ రెండో రౌండ్‌లో ముంబై డిసెంబర్ 23న హైదరాబాద్‌తో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ 169 పరుగులకే కుప్పకూలింది. ఇంత చిన్న లక్ష్యాన్ని ముంబై కేవలం 26 ఓవర్లలోనే సాధించింది. కానీ 7 వికెట్లు కోల్పోయింది. దీనికి కారణం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తీసుకున్న ఓ వినూత్న నిర్ణయం.
ఇది చదవండి: టిక్.. టాక్.. టిక్..! ఈ ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
తనకంటే ముందే బౌలర్లు..
ముంబై యువ ఓపెనర్లు ఇద్దరూ 44 పరుగుల తర్వాత పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే దీని తర్వాత, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ లేదా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు రాలేదు, బదులుగా జట్టులోని బౌలింగ్ ఆల్-రౌండర్లు ప్రమోట్ అయ్యారు. సూర్యన్ష్ షెడ్గే, అథర్వ అంకోలేకర్, శార్దూల్ ఠాకూర్, తనుష్ కోటియన్ మొదటిగా బ్యాటింగ్‌కు వచ్చారు. దీని కారణంగా ముంబై కేవలం 67 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
9వ స్థానంలో వచ్చి..
అప్పుడు సూర్య కుమార్ యాదవ్‌ను ఎనిమిదో నెంబర్‌లో పంపారు. కానీ అతడు కూడా 18 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. అలాంటి సమయంలో శ్రేయాస్ స్వయంగా 9వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి జట్టును ఓటమి నుంచి కాపాడాడు. అయ్యర్ తన అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించి కేవలం 20 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టును 3 వికెట్ల తేడాతో విజయతీరాలకు చేర్చాడు. కోటియన్‌తో కలిసి అయ్యర్ 70 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. కోటియన్ కూడా అజేయంగా 39 పరుగులు చేశాడు.
ఇది చదవండి: ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్ పెట్టండి.. నేచురల్ టిప్స్
శ్రేయాస్ 9వ స్థానంలో బ్యాటింగ్ ఎందుకు చేశాడన్నది ఇప్పుడు ప్రశ్న. జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్‌లకు అవకాశం ఇవ్వడం కోసమే శ్రేయాస్ అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. చిన్న లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని, ముంబై తన మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లకు బ్యాటింగ్ అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. తద్వారా వారు రాబోయే మ్యాచ్‌లకు కూడా సిద్ధం కావచ్చు. కానీ ఈ నిర్ణయం బెడిసికొట్టిందని చెప్పొచ్చు. ఆ స్థితిలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్వయంగా 9వ స్థానంలో వచ్చి 4 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి విజయాన్ని అందించాడు.
ఇది చదవండి: ఇదేం లొల్లిరా.. శోభనం రాత్రి వధువు వింత కోరికలు.. దెబ్బకు బిత్తరపోయిన వరుడు