చిత్రీకరణ పూర్తి చేసుకున్న విదాముయార్చి చిత్రం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. తొందర్లో ఈ సినిమాతో మనముందుకు వచ్చేస్తున్నారు కూడా..! ఇలాంటి ఈ టైంలో.. ఓ వీడియో బయటికి వచ్చింది. ఆ వీడియోలో అజిత్ పుష్పసినిమాలోని ఊ అంటావా పాటకు డ్యాన్స్ చేసినట్టు కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది. ఎందుకుంటే ఆ వీడియోలో ఉంది రియల్ అజిత్ కాదు.. అజిత్ లా కనిపించే జూనియర్ అజిత్. మనిషిని పోలీన మనుషులు ఉంటారంటారు కదా.. అయితే అలా అజిత్‌ను పోలిన ఓ వ్యక్తి.. ఓ పార్టీలో పుష్ప సినిమా పాటకు డ్యాన్స్ చేయడం.. ఆ వీడియోను కొంత మంది నెటిజన్స్ అజిత్ గా భ్రమ పడుతూ వైరల్ చేడంతో.. ఈ వీడియో ట్విట్టర్లో జెట్ స్పీడ్లో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో ఉంది అజిత్ అయితే కాదు.. ఇది చూసిన కొంత మంది ఆ వీడియో కింద కామెంట్స్ లలో చెబుతున్న మాట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే