థాయిలాండ్ దేశంలో…అక్కడి నుంచి దుర్గారావు ఎన్నో కొత్తరకం మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. మూడేళ్ల క్రితం మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటారు. ఇప్పుడది కాయలు కాసింది. పళ్లయ్యాయి. చూడ్డానికి పసుపు రంగులో ఉండే ఈ పండు సీతాఫలం రుచినే తలపిస్తుంది. గట్టిగా ఉండటంతో కోసుకొని తినొచ్చు. పై తొక్క దళసరిగా ఉండటం వల్ల దాన్ని వలుచుకొని లోపల భాగాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని కూడా తినవచ్చు. కడియం నర్సరీల గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దేశ విదేశాలకు చెందిన మొక్కల్ని ఇక్కడకు తీసుకొని వాటిపై ప్రయోగాలు చేస్తూ ఆయా దేశాలలోని వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి పెంచుతుంటారు. థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన ఈ మొక్కకు అంటు కట్టి ఇప్పటికే 10 నుంచి 15 మొక్కల్ని అమ్మారు కూడా. వచ్చే సంక్రాంతి తర్వాత మరిన్ని అంట్లు కట్టడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. మొక్క ధర సుమారు మూడు నాలుగు వందలుంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆస్పత్రిలో నాగుపాము.. లేవలేని రోగులు కూడ పరుగో పరుగు
అదే పనిగా ఫోన్ చూస్తే.. పిచ్చి పట్టడం ఖాయమా ??
TOP 9 ET News: షూటింగ్ లో ప్రమాదం ప్రభాస్‌కు గాయం
Nikhil Maliyakkal: జాక్ పాట్ కొట్టిన బిగ్ బాస్8 విన్నర్ నిఖిల్.. డబ్బులే డబ్బులు !!
వాళ్లకో రూల్.. బన్నీకో రూలా ?? సుమన్ షాకింగ్ కామెంట్స్