వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే వాల్నట్స్ తినడం వల్ల మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి మేలు చేస్తుంది. వాల్ నట్స్ లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
వాల్నట్లో ఫైబర్, ఆంటో ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాల్నట్స్ అంటేనే డ్రైఫ్రూట్స్ లో పెట్టింది పేరు. ఇందులో విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ ఉంటాయి. మధుమేహ రోగులు నానబెట్టిన వాల్నట్స్ తినడం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు. వాల్నట్లు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి.
వాల్‌నట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ వాల్ నట్స్ తీసుకుంటే క్లీన్ గా ఉంటారు.
వాల్‌నట్స్‌లో మీ ఎముకలు, దంతాలను బలంగా మార్చే అనేక లక్షణాలు ఉన్నాయి. వాల్‌నట్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, వాల్‌నట్స్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కూడా వాపును తగ్గిస్తాయి.
వాల్ నట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి వాల్నట్లు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది గుండెకు మేలు చేస్తుంది.