నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? చూస్తే ఫిదా అవ్వాల్సిందే

నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? చూస్తే ఫిదా అవ్వాల్సిందే


ప్రస్తుతం టాలీవుడ్ లో పదుల సంఖ్యలో కొత్త భామలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకటి రెండు సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకుంటూ ఆఫర్స్ అందుకుంటున్నారు. అందం, అభినయంతో కుర్రకారు మనసులు దోచేస్తున్నారు. అలాగే పై ఫొటోలో ఉన్న బ్యూటీ కూడా.. ఈ ఫోటోలోని అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? నడుమందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న ఈ బ్యూటీ చాలా మంది అభిమాన హీరోయిన్. ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఈ చిన్నది తెలుగులో ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. చిన్న వయస్సులోనే నటిగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. మన తెలుగు అమ్మాయి కాదు కానీ అచ్చం మన తెలుగమ్మాయిలానే ఫీల్ అవుతుంటారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఈ మలయాళ బ్యూటీ.. మాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి.. తన నటనతో మెప్పించింది. ఇక ఈ మధ్య మలయాళంలో విడుదలైన ‘ప్రేమలు’ మూవీతో.. అటు మాలీవుడ్.. ఇటు టాలీవుడ్‌లో కుర్రాళ్లలో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇంతకీ ఆమె ఎవరో మీకు గుర్తొచ్చి ఉండొచ్చు.! ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు మమితా బైజు. ‘ప్రేమలు’ మూవీలో రేణు రాయ్ అనే మెచ్యూర్డ్ విమెన్ పాత్రలో ఈ కేరళ కుట్టి తన నటనతో  మెప్పించింది. ఎంతోమంది ప్రేక్షకులకు చేరువైంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో ఆమె నటనకు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.

ఈ క్రేజీ హీరోయిన్ కేరళలోని కొట్టాయంలో జన్మించింది. 2017లో ‘సర్వోపరి పాలక్కరన్’ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘హనీ బీ’, ‘డాకినీ’, ‘కృష్షం’, ‘స్కూల్ డైరీ’, ‘ది ఇంటర్నేషనల్ లోక్ స్టోరీ’, ‘వికృతి’, ‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’, ‘ఆపరేషన్ జావా’, ‘సూపర్ శరణ్య’ లాంటి చిత్రాలతో మెప్పించింది. ‘ప్రేమలు’ సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. కాగా, ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ సరసన ఓ చిత్రంలో నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Mamitha Baiju (@mamitha_baiju)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *