మహారాష్ట్రలో తొలిసారిగా దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే సహా మొత్తం 39 మంది మహాయుత నాయకులు మంత్రులుగా ప్రమాణం చేయించారు. నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మొత్తం 39 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. నాగ్‌పూర్ రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. 39 మందికి ఫడ్నవీస్ కేబినెట్‌లో చోటు దక్కింది. శాఖల కేటాయింపుపై కూడా స్పష్టత వచ్చింది. కీలకమైన హోంశాఖ, రెవెన్యూ శాఖను బీజేపీకి కేటాయించారు. శివసేనకు ఆరోగ్యశాఖతో పాటు రవాణశాఖ దక్కనుంది. ఎన్సీపీకి ఆర్ధికశాఖను కేటాయించారు. గవర్నర్ రాధాకృష్ణన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి షిండే , అజిత్ పవార్ హాజరయ్యారు. మంత్రివర్గణ విస్తరణకు ముందు సీఎం ఫడ్నవీస్ నాగ్‌పూర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. అంబేంద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు ఫడ్నవీస్.
బీజేపీ నుంచి గిరీష్ మహాజన్, చంద్రకాంత్ పాటిల్, పంకజా ముండే, రాధాకృష్ణ విఖే పాటిల్, చంద్రశేఖర్ బవాన్‌కులే, మంగళ్ ప్రభాత్ లోధా, ఆశిష్ షెలార్, జయకుమార్ రావల్, నితేష్ రాణే, శివేంద్ర సింగ్ భోసాలే, పంకజ్ భోయిర్, గణేష్ నాయక్, మేఘనా బోర్దికర్, మాధురి సావ్‌కా మిసాల్, , ఆకాష్ ఫండ్కర్, అశోక్ ఉయికే, జైకుమార్ గోర్ తదితరులు ప్రమాణం చేశారు.
శివసేన కోటా నుంచి ఏక్‌నాథ్ షిండే, సంజయ్ శిర్సత్, గులాబ్రావ్ పాటిల్, దాదా భూసే, ఉదయ్ సమంత్, శంభురాజ్ దేశాయ్, యోగేష్ కదమ్, ప్రకాష్ అబిత్కర్, ప్రతాప్ సర్నాయక్, ఆశిష్ జైస్వాల్ ఉన్నారు. ఎన్సీపీ నుంచి నరహరి జిర్వా, హసన్ ముష్రిఫ్, అనిల్ భైదాస్ పాటిల్, అదితి తత్కరే, బాబాసాహెబ్ పాటిల్, దత్తా భర్నే, సనా మాలిక్, ఇంద్రనీల్ నాయక్, ధనంజయ్ ముండే ప్రమాణం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల తర్వాత, శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే, ఎన్‌సీపీ అధినేత అజిత్ పవార్ డిప్యూటీగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఇక సోమవారం(డిసెంబర్16) నుంచి నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..