తీరని విషాదం.. పెళ్లైన 18ఏళ్లకు పుట్టిన మగబిడ్డ.. ఆడుకుంటూ విక్స్‌ మూత మింగేశాడు..!

తీరని విషాదం.. పెళ్లైన 18ఏళ్లకు పుట్టిన మగబిడ్డ.. ఆడుకుంటూ విక్స్‌ మూత మింగేశాడు..!


ఈ జంటకు పెళ్లయి 18 ఏళ్లయినా ఇప్పటికీ సంతానం కలగలేదు. ఎవరు ఏది చెబితే అదే చేశారు. పూజ-పునస్కారాలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు, ఆయుర్వేదం, మూలికా, ఆసుపత్రి చికిత్సతో సహా వందలాది ప్రయత్రాలు, కార్యాలు చేశారు. సంతానం కోసం అందరూ దేవుళ్లను వేడుకున్నారు. 18 ఏళ్ల తర్వాత ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఈ మగబిడ్డ కేవలం 14 నెలలు మాత్రమే బతికాడు. ఆడుకుంటూ స్పృహాతప్పి పడిపోయిన చిన్నారికి సకాలంలో వైద్యం అందక తల్లిదండ్రుల చేతుల్లోనే మృతి చెందిన విషాధ సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. 14 నెలల చిన్నారి మృతి చెందడంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని సారెడి బాడి పట్టణంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. హీరెన్ జోషి కుమారుడు మాన్విక్ సోమవారం రాత్రి విక్స్ డబ్బాతో ఆడుకుంటూ పొరపాటున ఆ డబ్బా మూత మింగేశాడు. దాంతో అస్వస్థతకు గురైన చిన్నారి సొమ్మసిల్లి పడిపోయాడు. అది గమనించిన తల్లిదండ్రులు వెంటనే చికిత్స నిమిత్తం బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆ సమయంలో డాక్టర్‌ అందుబాటులో లేరు. దాంతో బాలుడిని బన్స్వారా ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే బాలుడు చనిపోయాడు.

సకాలంలో వైద్యం అందకపోవడంతోనే చిన్నారి మరణించాడంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రి గేటుకు తాళం వేసి వైద్యశాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సిబ్బంది కొరతపై అసహనం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *