ముఖ్యంగా గాడిద పాలు సేవిస్తే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని ముఖ్యంగా శీతాకాలంలో ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఆయాసం, కఫం, జలుబు, దగ్గు లాంటివి నిరోధించడానికి గాడిద పాలు ఔషధంగా పనిచేస్తాయని ప్రజల్లో బలంగా నమ్మకం ఉంది. దీంతో చలికాలం వచ్చినా.. నాలుగు నెలల పాటు విపరీతమైన డిమాండ్ గాడిద పాలకు నెలకొంది. గాడిద పాల ధర సైతం ఎక్కువే.. ఒక చిన్న టీ కప్పు సైజులో ఉండే గాడిద పాలు ధర ₹100. ఈ లెక్కన లీటర్ గాడిద పాలు కొనాలంటే ₹7000 వరకు ఖర్చవుతుంది. గాడిదను పెంచడానికి పోషించడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చవడంతోనే గాడిద పాల ధర కూడా అధికంగా ఉంటుందని చెప్తున్నారు. ఒక్కో గాడిద రోజుకు అర లీటర్ నుంచి లీటర్ వరకు మాత్రమే పాలిస్తుంది. గాడిద పాలలో విటమిన్లు పుష్కలంగా ఉండటంతో ప్రజలు వాటిని ఎక్కువగా సేవిస్తున్నారని అందుకే డిమాండ్ ఉందని వ్యాపారులు అంటున్నారు. గాడిద పాలలో A విటమిన్, బి1, బి5, బి6, పాటు ఫోలిక్ ఆమ్లం ఉండటంతోనే వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారని చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika: లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్.. మీకు అర్థమవుతోందా ??