చిట్టి చేతుల‌కు గ‌ట్టి ట్యాగ్‌.. భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!

చిట్టి చేతుల‌కు గ‌ట్టి ట్యాగ్‌.. భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!


ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ చొర‌వ‌తో ఈసారి భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో ప్ర‌వేశ‌పెట్టిన చైల్డ్ మానిట‌రింగ్ సిస్ట‌మ్ (సీఎంఎస్‌) క్యూఆర్ కోడ్ చైల్డ్ ట్యాగ్ అద్భుత ఫ‌లితాలిస్తోంది… అయిదు రోజుల్లో త‌ప్పిపోయిన మొత్తం ప‌దిమంది చిన్నారుల‌ను ఈ సాంకేతిక‌త స‌హాయంతో త‌ల్లిదండ్రులు చెంత‌కు సుర‌క్షితంగా చేర్చారు.

భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల సంద‌ర్భంగా దుర్గమ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించేందుకు వ‌చ్చే అయిదేళ్లలోపు పిల్ల‌ల చేతికి క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ల‌ను జిల్లా యంత్రాంగం వేస్తోంది… ఐసీడీఎస్ విభాగం నుంచి దాదాపు 60 బృందాలు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, సిటీ ఎంట్రీ పాయింట్లు, క్యూలైన్ల‌తో సహా వివిధ ప్రదేశాలలో చిన్నారుల‌కు క్యూఆర్ కోడ్ రెస్ట్ బ్యాండ్‌ను ఏర్పాటు చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి.

బ్యాండ్‌ను చేతికి క‌ట్టే స‌మ‌యంలో మొబైల్ నంబ‌ర్‌తో స‌హా పిల్ల‌లు, త‌ల్లిదండ్రుల వివ‌రాల‌ను క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తం చేసి సర్వర్‌లో సేవ్ చేయ‌డం జ‌రుగుతోంది…ఒక‌వేళ పిల్ల‌లు తప్పిపోయినట్లయితే, ఆ పిల్లలను గమనించిన వారెవ‌రైనా ట్యాగ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పిల్లల పేరు, తల్లిదండ్రుల పేరు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్, తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి ఆప్షన్లు ఇచ్చారు… దీంతో చాలా తేలిగ్గా త‌ల్లిదండ్రుల‌కు కాల్ చేసి పిల్ల‌ల‌ను అప్ప‌గించొచ్చు. ఈసారి కార్య‌క్ర‌మంలో దాదాపు 12,000 మంది పిల్లలను ట్యాగ్ చేశారు…10 మంది పిల్ల‌ల‌ను గుర్తించి వారి తల్లిదండ్రులకు విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *