జంతువుల్లో ఉండే లివర్‌లో ఐరన్, ప్రోటీన్, విటమిన్ B12 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్‌గా ప్రచారం చేస్తారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) కూడా కాలేయంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని ధ్రువీకరించింది. రక్తహీనతను నివారించడానికి ఐరన్ చాలా ముఖ్యం. న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి ప్రోటీన్ కీలకం. అయినప్పటికీ గర్భిణీ స్త్రీలకు ఇది అంతగా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మితంగా తిన్నా కూడా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. లివర్ తినడం వల్ల అభివృద్ధి చెందుతున్న శిశువుకు ప్రమాదకరమని చెబుతున్నారు. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండటమే ఇందుకు కారణం. యూఎస్డీఏ ప్రకారం గర్భిణీ స్త్రీలకు విటమిన్ ఏ రోజుకు 8,000 IU అవసరమని నిర్ధారించింది. కానీ, కేవలం 100 గ్రాముల చికెన్ లివర్‌లో 11,100 IU విటమిన్ ఏ ఉంటుంది. మటన్ లేదా బీఫ్ లివర్‌లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ ప్రయోజనాలను ఇతర ఆహార పదార్థాల నుంచి పొందవచ్చు.
గర్భధారణ సమయంలో విటమిన్ ఏ ఎక్కువగా తీసుకుంటారా?
విటమిన్ ఏ ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ అధిక మొత్తంలో అది హానికరం అని వైద్యులు చెబుతున్నారు. లివర్‌లో పెద్ద మొత్తంలో విటమిన్ ఏ లేదా రెటినోల్‌ను కలిగి ఉంటుంది, ఇది ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే విషపూరితం అవుతుందని హెచ్చరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు లివర్ తినడం ఎందుకు నివారించాలో వివరిస్తూ యూపీకి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ అగర్వాల్ ఇలా అన్నారు. “లివర్‌లోని అధిక విటమిన్ ఏ కంటెంట్ ఉంటుంది. అధిక రెటినోల్తో ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతాయి. అంటే అభివృద్ధి చెందుతున్న పిండంలో వైకల్యం కలిగిస్తుంది” అని చెప్పారు.
లివర్ ఎప్పుడు తినకూడదు?
“విటమిన్ ఏ అధిక స్థాయిలు వల్ల పిండంలో కేంద్ర నాడీ వ్యవస్థ, క్రానియోఫేషియల్, గుండెలో పుట్టుకతో వచ్చే లోపాలతో ముడిపడి ఉన్నాయి. పిండంలో అవయవాలు ఏర్పడే మొదటి త్రైమాసికంలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది” అని అగర్వాల్ చెప్పారు.
లివర్‌కు ప్రత్యామ్నాయాలు
గర్భిణీ స్త్రీలు అనేక ఇతర వనరుల నుంచి అవసరమైన పోషకాలను పొందవచ్చు.
ఐరన్: లీన్ మీట్, బీన్స్, ధాన్యాలు, బచ్చలికూర, తృణధాన్యాలు
ఫోలేట్: ఆకు కూరలు, సిట్రస్ పండ్లు, బీన్స్, ధాన్యాలు.
విటమిన్ B12: చేపలు, మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, పాల ఉత్పత్తులు.
“ఈ ప్రత్యామ్నాయాలు అధిక విటమిన్ ఏ తీసుకోవడంతో సంబంధం లేకుండా అవసరమైన పోషకాలను అందిస్తాయి” అని అగర్వాల్ చెప్పారు.