భారతదేశంలో మధుమేహం పెద్ద ముప్పుగా మారుతోంది.. ఎందుకంటే డయాబెటిస్ కేసులు ప్రతి సంవత్సరం వేగంగా పెరుగుతున్నాయి. ICMR ప్రకారం.. భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మధుమేహంతో బాధపడుతున్న రోగులలో 50 నుంచి 70 శాతం మంది కూడా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. బీపీ పెరగడం వల్ల గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు వస్తాయి. అటువంటి పరిస్థితిలో, డయాబెటిస్‌లో హై బిపి ఎందుకు వస్తుంది.. దానిని ఎలా నిరోధించాలి.. ? అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం..
మధుమేహంలో బ్లడ్ ప్రెజర్ (బీపీ) ఎందుకు పెరుగుతుందో తెలుసుకోండి..
డయాబెటిస్‌లో, శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. షుగర్ లెవెల్ అదుపులో లేకుంటే గుండె, కిడ్నీలు, కళ్లు, చర్మం, రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్ ప్రకారం.. మధుమేహం వచ్చిన తర్వాత 50 నుండి 70 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నారు. అధిక బీపీ వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. మధుమేహం అనేది శరీరంలోని దాదాపు ప్రతి భాగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే వ్యాధి.
డయాబెటిక్ రోగులకు అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది?
డయాబెటిస్‌లో ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది.. దీని కారణంగా శరీరంలో ఇన్సులిన్ మొత్తం సరిగ్గా ఉత్పత్తి చేయబడదు. దీంతో బీపీ పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్లలో బరువు పెరగడం సర్వసాధారణం.. ఇది హై బీపీకి కూడా కారణమవుతుంది. షుగర్ స్థాయి పెరగడం వల్ల నరాలు దెబ్బతింటాయి.. ఇది బీపీని పెంచుతుంది.
మధుమేహంలో షుగర్ లెవెల్ పెరిగినప్పుడు, అది శరీరంలోని నరాలకు హాని కలిగిస్తుంది. దీని కారణంగా సిరలు సన్నబడటం ప్రారంభిస్తాయి. దీని వల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. ఇది అధిక బీపీకి కారణమవుతుంది.. రక్తపోటు పెరగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో, మధుమేహాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. లేకుంటే అది చాలా తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది.
మధుమేహాన్ని ఎలా నివారించాలి..
మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి
రోజువారీ వ్యాయామం
ఊబకాయం పెరగనివ్వవద్దు
మిఠాయిలు ఎక్కువగా తినవద్దు
మానసిక ఒత్తిడికి గురికావద్దు
బీపీని ఎలా అదుపులో ఉంచుకోవాలి..
మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చండి
రోజువారీ వ్యాయామం చేయండి..
ఎక్కువ ఉప్పు తినవద్దు
మద్యం – ధూమపానం మానుకోండి
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి