ఇవి తినేవేమో అనుకుంటున్నారా..? మీరు పొరబడినట్లే.. ఎయిర్‌పోర్టులో కళ్లు బైర్లు కమ్మే సీన్..

ఇవి తినేవేమో అనుకుంటున్నారా..? మీరు పొరబడినట్లే.. ఎయిర్‌పోర్టులో కళ్లు బైర్లు కమ్మే సీన్..


ఎయిర్‌ పోర్టులు గోల్డ్‌ స్మగ్లింగ్‌కు అడ్డాలుగా మారుతున్నాయ్‌.. శంషాబాద్‌, చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ… అన్ని ఎయిర్‌పోర్ట్స్‌లోనూ పెద్దఎత్తున గోల్డ్‌, డ్రగ్స్ స్మగ్లింగ్‌ జరుగుతోంది. అక్రమ రవాణాకు అధికారులు చెక్ పెడుతున్నప్పటికీ.. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు స్మగ్లర్స్‌. అయితే, ఎన్ని జిమ్మిక్కులు చేసినా గోల్డ్‌ స్మగ్లర్స్‌కి చెక్‌ పెడుతున్నారు కస్టమ్స్‌ అధికారులు. లేటెస్ట్‌గా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారంతోపాటు గంజాయ్ పట్టుబడింది.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఒకేరోజు పెద్దఎత్తున డ్రగ్స్‌, గంజాయి, గోల్డ్‌ పట్టుబడటం ప్రస్తుతం సంచలనంగా మారింది..

దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల దగ్గర భారీగా బంగారం పట్టుబడినట్లు చెన్నై కస్టమ్స్‌ పేర్కొంది.. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి కోటీ 30లక్షల రూపాయల విలువైన 1700 గ్రాముల గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమానం వచ్చి దుబాయ్‌ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు.

గోల్డ్‌, డ్రగ్సే కాదు.. చెన్నై ఎయిర్‌పోర్టులో గంజాయి కూడా పట్టుబడింది.. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర భారీగా గంజాయి దొరికింది. 76 లక్షల రూపాయల విలువైన ఏడున్నర కేజీల హైడ్రోపోనిక్ గాంజాని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వేర్వేరు ఘటనల్లో ముగ్గురిని అరెస్టు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *