ఆఫ్ఘనిస్తాన్‌లో TTP రహస్య స్థావరాలు లక్ష్యంగా పాకిస్థాన్ వైమానిక దాడి..15 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో TTP రహస్య స్థావరాలు లక్ష్యంగా పాకిస్థాన్ వైమానిక దాడి..15 మంది మృతి


ఆఫ్ఘనిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లోని బర్మల్ జిల్లాలో పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా 5 మంది మరణించారు. ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మీడియా నివేదికల ప్రకారం లామన్‌తో సహా ఏడు గ్రామాలపై మంగళవారం రాత్రి జరిగిన దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. ఈ బాంబు దాడికి పాకిస్థాన్ జెట్ విమానాలే కారణమని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. బర్మాల్‌లోని ముర్గ్ బజార్ గ్రామం ధ్వంసమైందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ దాడులతో మానవతా సంక్షోభాన్ని మరింత పెరుగుతుంది. వైమానిక దాడుల వలన ప్రజల ప్రాణనష్టం విస్తృత విధ్వంసానికి కారణమయ్యాయి. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

నివేదిక ప్రకారం తాలిబాన్ మంత్రిత్వ శాఖ భూమి, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం తమ చట్టబద్ధమైన హక్కు అని పేర్కొంది. ఈ దాడిని ఖండిస్తూ వజీరిస్థాన్ శరణార్థులు లక్ష్యంగా ఉన్నారని పేర్కొంది. పాకిస్తాన్ అధికారులు వైమానిక దాడిని అధికారికంగా ధృవీకరించనప్పటికీ, సరిహద్దుకు సమీపంలో ఉన్న తాలిబాన్ స్థానాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సైనిక సన్నిహిత భద్రతా వర్గాలు సూచించాయి.

పాకిస్థాన్ సైన్యంపై దాడి

నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ తాలిబాన్ లేదా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) గత కొన్ని నెలల్లో పాకిస్తాన్ సైన్యంపై TTP దాడులను పెంచింది. అయితే ఈ ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ తాలిబాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖవర్జామీ పాకిస్థాన్ వాదనలను తోసిపుచ్చారు. వైమానిక దాడిలో పౌరులు, ఎక్కువగా వజీరిస్థాన్ శరణార్థులు మరణించారని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మహిళలు, చిన్నారులు సహా 15 మంది చనిపోయారు

ఈ దాడిలో అనేక మంది చిన్నారులు, ఇతర పౌరులు మరణించారని అనేక మంది గాయపడ్డారని చెప్పారు. అయితే అధికారికంగా ఈ విషయం ప్రకటించాల్సి ఉంది. మహిళలు, పిల్లలతో సహా కనీసం 15 మృతదేహాలను వెలికితీసినట్లు సోర్సెస్ తెలిపింది. ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్న నేపధ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

పాకిస్థాన్, తాలిబన్ల మధ్య ఉద్రిక్తత

వజీరిస్థాన్ శరణార్థులు పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాల కారణంగా నివాసాలు కోల్పోయిన పౌరులు. అయితే చాలా మంది TTP కమాండర్లు, యోధులు ఆఫ్ఘనిస్తాన్‌కు పారిపోయారని.. ఆ దేశ సరిహద్దు ప్రావిన్సులలో ఆఫ్ఘన్ తాలిబాన్లు వారిని రక్షిస్తున్నారని పాకిస్తాన్ చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో టిటిపి ఉగ్రవాదుల ఉనికి కారణంగా పాకిస్తాన్ , ఆఫ్ఘన్ తాలిబన్ల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తత పెరుగుతోంది. ఈ ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ తాలిబాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తుండగా, తాలిబాన్ మాత్రం ఆ గ్రూపుకు సహకరించడం లేదని పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *