మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. ఎక్కువగా ఈ అమ్మడు బాలీవుడ్ పైనే ఫోకస్ పెడుతుంది. బాలీవుడ్ లో రీసెంట్ గా వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది తమన్నా. ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా కనిపించి ప్రేక్షకులను కవ్వించింది. నిజానికి 2005లో విడుదలైన హిందీ చిత్రం చంత్సా రోషన్ షెహ్రాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇక తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ అనే సినిమాతో అడుగుపెట్టింది. ఆతర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి స్టార్ గా మారింది.
ఇది కూడా చదవండి : OTT Web Series : ఓయమ్మో..! ఇదెక్కడి అరాచకం.. మరీ ఇంత బోల్డ్ సిరీసా..!! ఒంటరిగానే చూడాలి
తెలుగులో తమన్నా దాదాపు అందరు హీరోలతో కలిసి సినిమాలు చేసింది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో తమన్నా ఆడిపాడింది. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ నటించి మెప్పించింది ఈ అమ్మడు. ఇక బాహుబలిలో ప్రభాస్ సరసన తన పాత్రతో తమన్నా పాన్-ఇండియన్ క్రేజ్ అందుకుంది. నటి తమన్నా భాటియా ప్రస్తుతం తమిళం, తెలుగు అలాగే హిందీల్లో పాన్-ఇండియన్ చిత్రాలలో నటిస్తోంది. తెలుగులో చివరిగా చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో చేసింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఇది కూడా చదవండి :ప్రియుడితో కలిసి చిందులేసిన క్రేజీ బ్యూటీ.. కుళ్ళుకుంటున్న కుర్రాళ్ళు..
తమిళంలో ఇటీవల విడుదలైన బాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నాతో పాటు రాశి ఖన్నా, కోవై సరళ, యోగి బాబు, సంతోష్, వీటీవీ గణేష్ తదితరులు నటించారు. నేడు తమన్నా పుట్టిన రోజు ఈ సందర్భంగా తమన్నా గత ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పెద్ద హీరోల సినిమాల్లో పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా నటిస్తారా.? అన్న ప్రశ్నకు తమన్నా స్పందిస్తూ.. కథ సరిగా లేకపోతే ఎంత పెద్ద నటుడి సినిమా అయినా నటించనని స్పష్టంగా చెప్పింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. కొన్ని సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోయినా నటించాను.. కానీ తర్వాత ఆ సినిమా విజయం తన నిర్ణయం గురించి ఆలోచించేలా చేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది తమన్నా.. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.