అయ్యో ఎంత ఘోరం.. గ్రైండర్‌లో పడిపోయి యువకుడు మృతి! వీడియో వైరల్

అయ్యో ఎంత ఘోరం.. గ్రైండర్‌లో పడిపోయి యువకుడు మృతి! వీడియో వైరల్


ముంబై, డిసెంబర్ 17: ఫుడ్‌ స్టాల్‌లో అనుకోని ప్రమాదం జరగడంలో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. పిండి రుబ్బుతున్న గ్రైండర్‌లో చేతి పెట్టడంతో.. చేతి గ్రైండర్‌లో ఇరుక్కుపోయింది. దీంతో కన్నుమూసి తెరిచేలోగా అతడు గ్రైండర్‌లో పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో గ్రైండర్‌లో పిండితోపాటే ఆ యువకుడు కూడా ఛిద్రమైపోయాడు. ఈ షాకింగ్‌ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

ముంబైలో రోడ్డు పక్కనున్న ఓ పుడ్‌ స్టాల్‌లో 19 ఏళ్ల సూరజ్ నారాయణ్ యాదవ్ పనిచేస్తున్నాడు. సూరజ్‌ జార్ఖండ్ నివాసి. ఇటీవల వర్లీలోని రోడ్డు పక్కన చైనీస్ ఫుడ్ స్టాల్‌లో పనికి కుదిరాడు. మంచూరియన్, చైనీస్ భెల్ కోసం ఆహార పదార్థాలను సిద్ధం చేయడానికి ఎలక్ట్రిక్‌ గ్రైండర్‌లో యాదవ్‌ ముడి పదార్ధాలను ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ గ్రైండర్‌ పెద్ద పరిమాణంలో ఉంది. యాదవ్‌కు నడుము ఎత్తులో ఉంది. దీంతో గ్రైండర్‌లోని పదార్ధాలను తీయడానికి అందులో చేయి పెట్టాడు. కానీ అనుకోని విధంగా అతని చేయి గ్రైండర్‌లో ఇరుక్కుపోయింది. అంతే.. క్షణాల్లోనే అతడిని యంత్రం మింగేసింది. నిజానికి యాదవ్‌కు అటువంటి పరికరాలను నిర్వహించడంలో ఎలాంటి అనుభవం లేదు. అదే అతడి ప్రాణాలకు ముప్పు తెచ్చింది.

గ్రైండర్‌ను నడుపుతున్నప్పుడు అతడు అందులో పడిపోయిన దృశ్యాలు షాపులోని CCTVలో రికార్డయ్యాయి. షాపు నిర్వహకుడు కోతేకర్ సరైన భద్రతా చర్యలు, శిక్షణ ఇవ్వకుండానే యాదవ్‌కు ఉద్యోగం కేటాయించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. గ్రైండర్‌లో యువకుడు పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *